logo

సురక్షిత వల

క్రింద ఒక సురక్షిత వలను తన భద్రత కొరకు అమర్చుకొని, ఒక మనిషి నేలమట్టమునకు పైన ఒక తీగమీద (ఉదా : సర్కసులో పైన ఉన్న ఒక తీగపై నడచేవానిలా) ఎలా నడుస్తాడో, ఆలాగునే యేసును ఒక మనకు రక్షణగా మార్చుకోవాలి. సురక్షిత వల లేకపోతే, ఒక వేల పడిపోతే ప్రమాదానికి గురి అవుతాడు. క్రింద సురక్షిత వల ఉంటే ఒకవేళ పడిపోయినా ఆ మనిషి బయపడడు సరికదా, ఆ వల వలన రక్షింపపడతాడు. అది మరలా మరలా చేయడానికి ఉపయోగపడే ఒక విషయము.

యేసే ఆ సురక్షిత వల కనుక ఆ వల యొక్క బలము ఎన్నటికీ తెగిపోదు.

bilde

"మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో," (రోమీయులకు 5:20)

"కాబట్టి యిప్పుడు క్రీస్తు యేసునందున్నవారికి ఏ శిక్షా విధియు లేదు." (రోమీయులకు 8:1)

కానీ, సురక్షిత వల అనగా యేసు క్రీస్తును కలిగి లేకుండా; దేవుడు ప్రతీ మనవాళికి తీర్పు తీర్చు దినమందు; ఒక మనిషి చేయు ప్రతీ అపరాధము మరియు పాపము తీర్పు దినమున లెక్క అప్పగించవలిసి ఉన్నది. బైబిల్ ప్రకారము, యేసు క్రీస్తు చెప్పినది; పాపము వలన కలుగు పరియవసనము దేవుని రాజ్యమునుండి, దేవుని ప్రేమ నుండి శాశ్వతముగా వేరు చేయబడతాము;

"నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును." (మత్తయి సువార్త 12:36)

"మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసి యున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది." (హెబ్రీయులకు 4:13)

"కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును." (యోహాను 3:36)

"వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు." (మత్తయి సువార్త 25:46)