logo

ఆలస్యం సాధ్యమేనా?

కొంతమంది మారుమనసు పొందుట ఆలస్యం చేసి, ముసలితనములో క్రైస్తవులవుతారు. అది సాధ్యమే. నీవు జీవించినంతకాలము దీనిని ఆలస్యం చేయకు సుమీ. నీకు తెలియకపోయిన, నీవు ఎంత ముసలివాడవైన, నీవు చనిపోవునప్పటికి, నీ మరణమునకు నీవు సిద్దమైనప్పటికిని, నీవు చనిపోయిన తరువాత, నీ శాశ్వత జీవితము యొక్క తలుపులు మూయబడతాయి. అప్పుడు నీకు రెండవ అవకాశం ఉండదు. అప్పటికే ఆలస్యము అయింది కనుక.

bilde

నీ జీవితములో నీవు ఎన్నడూ పరిగణలోనికి తీసుకొనని అతి ముఖ్యమైన విషయము నీవు ఆశ్రద్ధ చేయవద్దని నీకు రూడి పరుస్తున్నాము. యేసు చెప్పిన రీతిగా:

"ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?" (మత్తయి సువార్త 16:26)

"భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును." (మత్తయి సువార్త 6:19-21)

"మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని నేనీలాగు చేతును; నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను. దేవుని యెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను." (లూకా సువార్త 12:16-21)

మారుమనస్సు పొందుటను అశ్రద్ద చేయుట - నీ జీవితముపట్ల దేవుడు కలిగిన ప్రణాళికను నీవు పాగోట్టుకుంటున్నావని సూచించును.
ఇదికాకుండా, నీవు మారుమనస్సు పొందితే, నీ జీవితమును యేసు పాడు చేయాలని కోరుకోడు. యేసు చెప్పెను:

"కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును." (మత్తయి సువార్త 6:33)