logo

పునరుత్థానమునకు సాక్షము

మానవాళి పాపములకొరకు దేవుడు అంగీకరించు బలియాగము, యేసు క్రీస్తు వారి బలియాగము మాత్రమే. అయితే, మూడవ దినమున మరణము నుండి యేసు క్రీస్తు వారి పునరుత్థానము ద్వారానే దేవుడు అంగీకరించునని ఆయన తెలియచేసేను.

యేసు క్రీస్తు పునరుత్థానము తరువాత ఆయన శిష్యులు కాక, ఇంకా 500 మంది సాక్షులు యేసును కలుసుకున్నారని మరియు వారిలో చాలామంది 25 సంవత్సరాలకంటే ఎక్కువ కాలము జీవించారని (1. కొరింధీ 15:6) లో అపోస్తులుడైన పౌలు సూచించాడు. అంతే కాకుండా, ఆయనను శిలువ వేసిన రోమా ప్రజలే కాక ఇంకా అనేకమంది ఆయన మరణమునకు సాక్షమిచ్చేను.

bilde

పునరుత్థానము తరువాత, యేసు ఆయన శిష్యులకు చెప్పెను: "అంతట ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి - క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు." (లూకా సువార్త 24:44-48)

పునరుత్థానము తరువాత యేసు క్రీస్తు తన శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు, పన్నెండు మంది శిష్యులలో ఒకరైన తోమ వారితో లేడు. "యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.
ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను."
(యోహాను 20:24-29)